Shraddha Kapoor: రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన కామెడీ హారర్ చిత్రం ‘స్త్రీ 2’. ఒకవైపు భయపెడుతూ.. మరోవైపు నవ్వుల్లో ముంచెత్తే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
Shraddha Kapoor…
ఈ నేపథ్యంలో చిత్రబృందం అభిమానుల కోసం ఆగస్టు 14న ప్రత్యేక ప్రివ్యూ షోలను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. ఆ రోజు రాత్రి 7:30 తర్వాత ఈ సినిమాని థియేటర్లలో చూడొచ్చని ప్రకటించింది. త్వరలోనే ఈ మూవీ టికెట్లు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ అనే ప్రత్యేక పాటతో తమన్నా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ అభిమానుల్ని అలరించనున్నారు. జియో స్టూడియోస్, మ్యాడోక్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపర్‌శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషించారు.
Also Read : Akshay Kumar: ప్లేటులో వడ్డించి మరీ అన్నదానం నిర్వహించిన బాలీవుడ్ స్టార్ హీరో !