Anchor Sreemukhi : కాలినడకన తిరుమలకు చేరుకున్న యాంకర్ శ్రీముఖి

నిత్యం టీవీ షోస్ తో బిజీగా ఉంటే శ్రీముఖి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది...

Hello Telugu - Anchor Sreemukhi

Anchor Sreemukhi : తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ శ్రీముఖికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు వరుసగా టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోందీ బుల్లితెర రాముమల్మ. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది.టీవీషోస్, సినిమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కూడా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో తరచూ పంచుకుంటుందీ అందాల తార.

Anchor Sreemukhi Visited

నిత్యం టీవీ షోస్ తో బిజీగా ఉంటే శ్రీముఖి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రీముఖి. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ‘ ఏడు కొండల వాడా.. వెంకట రమణ.. గోవిందా.. గోవిందా.. మొదటి సారి తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కాను’ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది శ్రీముఖి.

Also Read : Chiranjeevi-Charan : వాయనాడ్ బాధితులకు కోటి విరాళం ప్రకటించిన తండ్రి కొడుకులు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com