Anupam Kher: ‘కార్తికేయ 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన నటుడు అనుపమ్ ఖేర్. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాలతో పాటు, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన అనేక ప్రాజెక్ట్‌లలో ఈ టైమ్‌లెస్ టైటాన్ కొలాబరేట్ అవుతూనే ఉన్నారు. ఈ సక్సెస్‌ఫుల్ కొలాబరేషన్‌ని కొనసాగిస్తూ… అభిషేక్ అగర్వాల్ లేటెస్ట్ ప్రొడక్షన్ ‘ది ఇండియా హౌస్’ లో అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్. తాజాగా ఈ మూవీ సెట్స్‌లోకి ఆయన అడుగు పెట్టారు అనుపమ్ ఖేర్.
Anupam Kher…
‘ది ఇండియా హౌస్’ షూటింగ్ ఇటీవలే హంపి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో అఫీషియల్‌గా ప్రారంభమైంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ స్టార్ కాస్ట్ లో చేరారు. అనుపమ్ ఖేర్(Anupam Kher) సెట్ లోకి ఎంటరవ్వడంతో న్యూ డైనమిక్ ఎనర్జీ వచ్చినట్లుగా టీమ్ భావిస్తోంది. ఆయన ప్రాజెక్ట్స్‌లోకి రావడం క్రియేటివ్ స్పిరిట్, ప్రొడక్షన్ మూమెంటమ్ కి దోహదపడుతోంది. మేకర్స్ విడుదల చేసిన వీడియో అభిషేక్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ మధ్య పరస్పర అభిమానాన్ని చూపిస్తుంది. ఇందులో ఆయన చాలా క్రూషియల్ రోల్‌లో నటిస్తున్నట్లుగా ఆయన వస్త్రదారణ చెబుతోంది.
అనుపమ్ ఖేర్ షూట్ లో జాయిన్ అయినట్లుగా చెబుతూ మేకర్స్ విడుదల చేసిన వీడియోలో అనుపమ్ ఖేర్ లుక్ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ.. సూటు, పంచెలో కళ్లద్దాలు పెట్టుకుని కనిపించడం క్యురియాసిటీని పెంచుతోంది. 1905 బ్యాక్ డ్రాప్‌లో లవ్, రెవెల్యూషన్ థీం ని ఎక్స్‌ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. డీవోపీ కెమరూన్ బ్రైసన్, ప్రొడక్షన్ డిజైనర్ విశాల్ అబానీ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
Also Read : Kunal Kapoor: బాలీవుడ్ ‘రామాయణ’లోకి మరో నటుడు !