Charu Haasan: ప్రముఖ హీరో కమల్ హాసన్ సోదరుడు, సీనియర్ నటి సుహాసిని తండ్రి చారు హాసన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా చారు హాసర్ అస్వస్థతకు గురయ్యినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈయన కూతురు, ప్రముఖ నటి సుహాసిని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తండ్రి పరిస్థితి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చింది.
Charu Haasan…
లోక నాయకుడు కమల్ హాసన్ కి చారు హాసన్ అన్నయ్య. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇకపోతే చారు హాసన్ కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుహాసిని ఇందులో ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా చాలాగుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది. ఇదిలా ఉండగా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చారు హాసన్… 1979 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులోనూ ‘హర’ అనే సినిమాలో నటించారు. తాజాగా ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన తండ్రికి ఏం పర్లేదని, కోలుకుంటున్నారని సుహాసిని చెప్పుకొచ్చింది.
Also Read : Sonu Sood : అగ్ర నటుడు సోను సూద్ కు 1200 మంది విద్యార్థులతో చిత్రపటం