Mega Family Olympics : టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి తన భార్య సురేఖతో, కొడుకు రామ్‌చరణ్, కోడలు ఉపాసన లతో కలిసి విహార యాత్రకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లండన్ వీధుల్లో కుటుంబంతో, మనవరాలు క్లింకారాతో తిరుగుతూ కనిపించిన చిరంజీవి, ప్రస్తుతం ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న పారిస్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒలంపిక్ ప్లాగ్‌ను ప్రదర్శిస్తూ అయా స్టేడియాల వద్ద సందడి చేశారు. ఈ క్రమంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ లు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందరూ పతకాలు గెలవలని కాంక్షించారు.
Mega Family Olympics…
ఆపై మన తెలుగు రాష్ట్రాల నుంచి గేమ్స్‌లో పాల్గొంటున్న వారిని కలిసి దగ్గరుండి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగుతూ సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో ఒలంపియన్ బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. మాల్దీవ్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌ను వీక్షించారు. అందులో విజయం సాధించి బయటకు వచ్చాక సింధుతో మెగా ఫ్యామిలీ కలిసి కాసేపు ముచ్చటించింది. తనతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
Also Read : Harish Shankar : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్