Harish Shankar : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

ఓ రచయితగా, దర్శకుడిగా కథ, పాత్రను దృష్టిలో పెట్టుకుని డైలాగులు రాస్తాను...

Hello Telugu - Harish Shankar

Harish Shankar : ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌’ రిలీజ్‌ అవుతుందా లేదా? అన్న ప్రశ్నకు తనదైన శైలి సమాధానం ఇచ్చారు దర్శకుడు హరీశ్ శంకర్‌. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఎక్స్‌ప్లోజివ్‌ టీజర్‌‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు హరీశ్ శంకర్‌(Harish Shankar) ఆసక్తికర సమాధానాలిచ్చారు. 80, 90ల సమయంలో జరిగే కథ ఇది. కొంచెం పొయిటిక్‌గా చెప్పాలంటే ల్యాండ్‌ లైన్స్‌, క్యాసెట్‌ రికార్డింగ్‌ సెంటర్లు, చేతక్‌ స్కూటర్లు, కుమార్‌ షాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్‌ బచ్చన్‌. ఫస్ట్‌ హాఫ్‌లో చాలా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. ఇందులో నేను కూడా గెస్ట్‌ అపీయరెన్స్‌గా ఒక సీన్‌లో కనిపిస్తా. కానీ అది పోస్టర్‌కే పరిమితం. ఇందులో రవితేజ బచ్చన్ గారి ఫ్యాన్ గా కనిపిస్తారు. బచ్చన్‌ గారిని బేస్‌ చేసుకొని చాలా మంచి ఐటమ్స్‌ వున్నాయి. అవి స్క్రీన్ మీద చూస్తే బావుంటుంది.

Harish Shankar Comment

ఓ రచయితగా, దర్శకుడిగా కథ, పాత్రను దృష్టిలో పెట్టుకుని డైలాగులు రాస్తాను. నా పర్సనాలిటీ విషయానికొస్తే ఎవ్వరైనా పొద్దున్న లేచి అద్దం చూసుకొని ‘నేను హీరో’ అనే బయలుదేరుతారు కదా జీరో అనుకోరు కదా! నిన్న చేసిన సినిమా కంటే ఈ రోజు చేసిన సినిమా బెటర్‌ గా వుండాలని కోరుకుంటాం. అప్పటికి ఇప్పటికి నాకు చాలా ఎక్స్‌ పీరియన్స్‌ వచ్చింది. ఈ సినిమా టేకింగ్‌ పరంగా, విజువల్‌, మ్యూజిక్‌, హీరో క్యారెక్టరైజేషన్‌ పరంగా మిరపకాయ్‌ కంటే మిస్టర్‌ బచ్చన్‌ హండ్రెడ్‌ టైమ్స్‌ బెటర్‌గా వుంటుంది. నా కెరీర్‌ ఫాస్టెస్ట్‌ సినిమా ఇది. దీనికి కారణం మా నిర్మాత విశ్వ ప్రసాద్. 78 రోజుల షూటింగ్‌లో ఏ రోజు ఇబ్బంది పడలేదు.

ఈ సినిమా చూశాక రవితేజ నా కాంబినేషన్ మీద మరింత అంచనాలు పెరుగుతాయి. కరోనా కొంత గ్యాప్‌ ఇచ్చింది. పవన్ కల్యాణ్‌గారు రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh)’ కాస్త పక్కన పెట్టి మిస్టర్‌ బచ్చన్ తెరకెక్కించా. ఓ సినిమా తీయాలంటే కథ, నవల, వార్త, ఇలా ఏదో ఒకటి స్ఫూర్తి ఉంటుంది. ఓ సినిమాకు మరో సినిమా స్ఫూర్తి కాకూడదు. నా గబ్బర్‌సింగ్‌, గద్దలకొండ గణేష్‌’ ఇవి రీమేక్‌ అని ఎవరైనా అంటే వారి సినిమా జ్ఞానం పట్ల జాలి పడతాను తప్ప సీరియస్‌గా తీసుకోను.

Also Read : Ram Talluri : పవన్ కోసం మా వైపు స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాం..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com