Tanikella Bharani : సుప్రసిద్ధ కవి, మాటల రచయిత, రంగస్థల నటుడు, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి. ఆయన దాదాపు 800కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు వారందరూ మా భరణి అనుకునేంతగా నేమ్ సంపాదించుకున్నారు. అలాంటి తనికెళ్ల భరణికి ఇప్పుడో గౌరవం వరించింది. గురువారం వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వారు తనికెళ్ల భరణికి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు ఇంత వరకు ఆయనకు డాక్టరేట్ రాలేదా? అని అంటుంటే.. ఇప్పటికైనా వచ్చినందుకు హ్యాపీ అంటూ తనికెళ్ల భరణి(Tanikella Bharani)కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Tanikella Bharani…
తనికెళ్ల భరణి విషయానికి వస్తే.. 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘సముద్రం’ సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారాయన. ఇక ఆయనలోని ఆధ్యాత్మికత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘ నాలోన శివుడు కలడు’ అంటూ ఆయన రచించిన ఆల్బమ్ ఇప్పటికీ, ఎప్పటికీ శివుని ఆలయాలలో మారుమోగుతూనే ఉంటుంది.
కాగా, ఎస్ఆర్ యూనివర్శిటీ వారు ప్రకటించిన ఈ డాక్టరేట్‌ను ఆగస్ట్ 3వ తేది, శనివారం వరంగల్‌లో జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకలో తనికెళ్ల భరణికి ప్రధానం చేయనున్నారు. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విద్యా సంస్థ యూనివర్శిటీగా మారిన తర్వాత ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో గతంలో సత్కరించింది. తనికెళ్ల భరణికి డాక్టరేట్ రావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తనికెళ్ల భరణి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ బిజీ నటుడిగా కొనసాగుతున్నారు.
Also Read : Allu Sirish : పుష్ప 2 రిలీజ్ పై ఆసక్తికర అంశాలను వెల్లడించిన శిరీష్