Urvashi Rautela: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో యువదర్శకుడు బాబీ తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘వేర్ ఈజ్ ది పార్టీ..’ అంటూ యువతను ఉత్రూతలూగించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా వేసిన స్టెప్పులకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీనితో ఊర్వశీ రౌతేలాకు వరుస ఆఫర్లు వస్తున్నారు. ప్రస్తుతం ఆమె నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ తెరకెక్కిస్తునన్న ‘ఎన్బీకే 109’ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు.
Urvashi Rautela…..
అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఊర్వశీ(Urvashi Rautela)కి స్వల్ప గాయాలయ్యాయని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనితో తమ అభిమాన నటి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో తనకు గాయాలు అయిన ఘటనపై ఊర్వశీ రౌతేలా స్పందించారు. ఓ వెల్నెస్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న సంబంధిత దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… గాయాల నుండి కలుకుంటున్నట్లు విక్టరీ సింబర్ చూపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఈ సందర్భంగా ‘ఎన్బీకే 109’ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ… ‘‘బలమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. బాలకృష్ణ సర్ గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. టాలీవుడ్ వాతావరణం నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులోనూ మరిన్ని అవకాశాలు అందుకుంటానని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
Also Read : Prabhu Deva: ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం !