Captain Miller : హీరో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి లండన్ నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అరుదైనగుర్తింపు లభించింది. ఈ చిత్రోత్సవంలో సినిమాను ప్రదర్శించగా ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్ తదితరులు నటించారు.
Captain Miller Movie Updates
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ చారిత్రక నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని బోర్సెస్టర్ హాల్‌లో జరిగిన పదో లండన్ నేషనల్ ఫిల్మ్ అకాడెమీ ఫెస్టివల్‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికై అవార్డు సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం ధనుష్ నటించిన ‘రాయణ్’ సినిమా ఈ నెలాఖరులో విడుదల కానుంది.
Also Read : Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి సిన్హా ఫన్నీ కామెంట్స్ !