The India House: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్వంత బ్యానర్ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘ది ఇండియా హౌస్’ టైటిల్ ను ఖరారు చేయగా… సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం హంపిలోని విరూపాక్ష దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మంగళవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది.
The India House Movie Updates
‘‘1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ, ఛాయాగ్రహణం: కామెరాన్ బ్రైసన్. ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read : Salman Khan: సల్మాన్ హత్యకు రూ. 25 లక్షలకు ఒప్పందం ?