Minister Nimmala : అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తమ నాయకుడు , సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గురువారం మంత్రి నిమ్మల (Minister Nimmala) మీడియాతో మాట్లాడారు. సీఎం సూచించిన వాటర్ మేనజ్మెంట్ ఆలోచనవిధానం మంచి సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. గతేడాదితో పోల్చితే గ్రౌండ్ వాటర్ , మేజర్, మీడియం రిజర్వాయర్ లలో నీటి నిల్వలు భారీగా పెరిగాయని చెప్పారు.
Minister Nimmala Rama Naidu Comments
ఈ ఏడాది వర్షపాతం తో పోల్చితే మైనస్ 9 శాతం రైన్ ఫాల్ తక్కువగా ఉన్నా కూడా భూగర్భ జలాలు , మేజర్, మీడియం రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయంటే అదంతా చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యం అయిందన్నారు. తుంగ భద్ర గేట్లు మార్చమని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.209 కోట్ల తో శ్రీశైలం ప్రాజెక్టు లో పెండింగ్ పనులు చేయాలని సూచించారని చెప్పారు నిమ్మల రామానాయుడు. కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్ల ఏర్పాటుకు 138 కోట్లు కేటాయించారని, వచ్చే సీజన్ కు పూర్తి చేయాలని సూచించారని తెలిపారు.
రాయలసీమ లో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదభరితం గా ఉంటే గత ఐదేళ్లలో ఒక్కరూపాయి కూడా ఆనాటి జగన్ రెడ్డి సర్కార్ కేటాయించ లేదన్నారు. వచ్చే సీజన్ నాటికి గోరకల్లు రిజర్వాయర్ కి మరమ్మతులు పూర్తి చేసేలా 56 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గత ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే హంద్రీ నీవా పనులు పూర్తి చేసి కుప్పంకు నీరందించామన్నారు. హంద్రీ నీవా ద్వారా 497 చెరువులకు నీరు అందించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. 2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు.
Also Read : Indian Rupee Drop Sensational : ట్రంప్ సుంకాలకు మరింత పతనమైన రూపాయి విలువ



















