Iswarya Menon: ఈడి ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించిన సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్, సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో ‘స్పై’లో ఏజెంట్ పాత్రలో నటించి మెప్పించింది యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్. ఇప్పుడు ‘భజే వాయు వేగం’ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేం కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య బ్యూటీషియన్ గా ప్రేక్షకులను మెప్పించింది.
Iswarya Menon …
ఇక యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్(Iswarya Menon) విషయానికి వస్తే… తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన ఈమె విద్యార్థి దశలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చేది. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందింది. అలా ఈ భామకు చదువుకునే రోజుల్లోనే సినీ అవకాశాలు వస్తే అప్పుడు తిరస్కరించింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాక కొన్నాళ్లు ఓ ఐటీ కంపెనీలో పనిచేసింది. ఆ ఉద్యోగం సంతృప్తినివ్వకపోవడంతో.. ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ‘కాదలిల్ సోదప్పువదు యెప్పడి’ తమిళ సినిమాలో చిన్న అవకాశం దక్కించుకుంది. అదే తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’ పేరుతో విడుదైంది.
సిద్ధార్థ్, అమలాపాల్ హీరోహీరోయిన్లు. ఆ తర్వాత, ‘యాపిల్ పెన్నే’, ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘నమో భూతాత్మ’, ‘మాన్‌సూన్ మ్యాంగోస్’.. ఇలా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించింది. ‘తమిళ్ రాకర్స్’ వెబ్‌సిరీస్‌లోనూ మెరిసింది. గతేడాది విడుదలైన ‘స్పై’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏజెంట్ వైష్ణవిగా ఆమె నటన మెప్పించినా.. సినిమా అలరించలేకపోయింది. తెలుగులో ఆమె సైన్ చేసిన తొలి చిత్రం ‘భజే వాయు వేగం’ కాగా.. రెండో సినిమా ‘స్పై’ ముందుగా విడుదలైంది.
‘భజే వాయు వేగం’ సినిమాలో బ్యూటిషియన్ ఇందుగా కనిపించింది. ‘స్వతహాగా నాకు మన సంప్రదాయం ఉట్టిపడే దుస్తుల్ని ధరించడానికే ఇష్టపడతా. ఇందుగా అలానే కనిపిస్తా’ అని ఓ సందర్భంలో చెప్పింది. ‘కమర్షియల్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడం ముఖ్యమే. అదే సమయంలో నటనకి ప్రాధాన్యమున్న పాత్రలూ చేయాలనేది నా ఆలోచన. ఆడిపాడేందుకే అన్నట్టుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే తరహా పాత్రల కంటే, కథలో ప్రాధాన్యం ఉండే పాత్రలంటేనే ఇష్టం’ అని తెలిపింది.
స్వతహాగా డ్యాన్సర్‌కావడంతో సినిమాల్లోనూ నృత్య ప్రధానమైన పాత్రలు పోషించాలని కోరుకుంటోంది. తెలుగులో ప్రస్తుతం మూడు చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నాయి. తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘బజూక’లో కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read : Nivetha Pethuraj: పోలీసులతో నివేథా పేతురాజ్ వాగ్వివాదం ?