Huma Qureshi: ‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యశ్… ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. మాదకద్రవ్యాల సరఫరా ఇతివృత్తంతో అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడీ చిత్రంలోని మరో ముఖ్య పాత్రను బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ(Huma Qureshi) దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ కథలో ఆమె పాత్ర పూర్తిగా యాక్షన్ కోణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ముస్తాబు కానున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్నట్లు తెలిసింది.
Huma Qureshi Movies..
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అంతేకాదు యశ్ కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే షూటింగ్ కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా కరీనా కపూర్ స్థానాన్ని లేడీ సూపర్ స్టార్ నయనతార దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం యూఎస్‌లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలతో సంప్రదింపులు జరుపుతోంది చిత్ర బృందం. అంతేకాదు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్‌గా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read : Double Ismart: ట్రెండింగ్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ !