Singer Sunitha: టాలీవుడ్ లేడీ సింగర్స్ అనగానే కొన్నిపేర్లు గుర్తొస్తాయి. వాటిలో టాప్ లో కచ్చితంగా సునీత పేరు ఉంటుంది. ‘ఈ వేళలో నీవు’ అనే పాటతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీత తన మధురమైన స్వరంతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా సునీత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ ను అందించారు. ఈ అభిమానుల గిఫ్ట్ తో సునీత అరుదైన ఘనత సాధించింది.
Singer Sunitha Got Gift
ఆదివారం సునీత పుట్టినరోజుని ఆమె అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ లో సునీత వీడియోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు అతికొద్ది మందికే ఈ అరుదైన అవకాశం లభించగా… ఇప్పుడు సునీత కూడా ఆ జాబితాలో చేరారు. పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సునీత ఇప్పటి వరకు పొందిన అవార్డులతో పాటు ఆమె సాధించిన పురస్కారాలతో కూడిన వీడియోను న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ లో ప్లే చేశారు. మే 12 తేదీన ప్రతి గంటకు 60సెకండ్ల పాటు ఈ వీడియో ప్రదర్శించడం విశేషం.
Also Read : Double iSmart: ఈ నెల 15న ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ !