Sai Pallavi: సాయి పల్లవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘తండేల్‌’ టీమ్ !

సాయి పల్లవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన ‘తండేల్‌’ టీమ్ !

Hello Telugu - Sai Pallavi

Sai Pallavi: శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టి నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి సాయిపల్లవి. డ్యాన్సర్ గా ఈటీవీలో నిర్వహించిన రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ… తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌ గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘తండేల్‌’ సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాకిస్తాన్ లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్య్సకారుల బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీతో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sai Pallavi Got Surprise

అయితే గురువారం సాయిపల్లవి(Sai Pallavi) బర్త్‌ డే సందర్భంగా ‘తండేల్‌’ చిత్ర యూనిట్‌… సర్ ప్రైజ్ ఇచ్చింది. నేచురల్ బ్యూటీకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్తూ ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగు సినిమాలతో సాయి పల్లవి మెప్పించిన పాత్రలను ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్‌ మూవీ సెట్‌ లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్‌ తో ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న తాజా సినిమా ‘తండేల్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా, విభిన్నమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమాలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ ప్రేమకథను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు.

Also Read : Puri Jagannadh: అవమానించిన వాళ్లకు చిరునవ్వుతో సమాధానం చెప్పాలి – పూరి జగన్నాథ్‌

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com