Shabana Azmi: రంగస్థల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి పారలల్ సినిమా అనే పంథాకు ఆద్యురాలు ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ. 1974లో ‘అంకుర్’ సినిమాతో బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసిన ఈ హైదరాబాదీ బ్యూటీ… ఈ ఏడాదితో తన 50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. నటిగా, సామాజిక కార్యకర్తగా, రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా హక్కుల పోరాటాల కార్యకర్తగా షబానా అజ్మీ(Shabana Azmi) ప్రయాణం… నేటి తరం సినీ తారలకే కాదు సాధారణ మహిళలకు కూడా స్పూర్తి దాయకం. ఈ నేపథ్యంలో షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్‌వైఐఫ్‌ఫ్) ఓ ప్రత్యేక వేడుకకు సన్నాహాలు చేస్తుంది. మే 31 నుండి జూన్ 2 వరకు మూడు రోజుల పాటు షబానా యాభై ఏళ్ళ సినీ ప్రస్థానంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది.
Shabana Azmi…
1974లో ‘అంకుర్’ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన షబానా. ఇన్నేళ్లు చిత్రపరిశ్రమకు అందించిన సేవలకు విశేష ఆదరణ లభించిందని సినీ వర్గాలు తెలిపాయి. భారతీయ, అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో షబానా ఈ ఏడాదితో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా… దీపా మెహతా దర్శకత్వంలో ఈమె నటించిన ‘ఫైర్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నేఫథ్యంలో షబానా మాట్లాడుతూ…‘‘ఎన్‌వైఐఫ్‌ఫ్’ ప్రారంభమైనప్పటి నుంచి దానితో నాకు మంచి అనుబంధం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్‌వైఐఫ్‌ఫ్ సాధించిన పురోగతి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా 50ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఎన్‌వైఐఫ్‌ఫ్ ఓ వేడుకలా నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
Also Read : Devaki Nandana Vasudeva : మే లో రానున్న ‘దేవకీ నందన వాసుదేవ’ ఫస్ట్ సింగిల్