Super Star Rajinikanth: ‘జై భీమ్’ సినిమా ఫేం టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘వెట్టయాన్’ (తెలుగులో ‘వేటగాడు’). ఇందులో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘వేట్టయాన్ ’ పై అభిమానులకు భారీగా అంచనాలు ఉన్నాయి. ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత… బూటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే పోలీసు అధికారిగా రజనీకాంత్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. దీనితో ఈ సినిమా కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Super Star Rajinikanth Movie Updates
‘వెట్టయాన్’ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో రజనీ తుపాకీ గురి పెట్టి చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్ గా కనిపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిలో రజనీ రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read : Danush: విడాకులకు ధరఖాస్తు చేసిన ధనుష్ – ఐశ్వర్య ?