Shruti Haasan: కమల్ హాసన్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్… మంచి నటిగా, మంచి డ్యాన్సర్ గా, మంచి సింగర్ గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించిన శృతిహాసన్… కోలీవడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో ఇటీవల ఓ స్పెషల్ సాంగ్‌లో కలిసి నటించింది. ‘ఇనిమేల్’ పేరుతో విడుదల చేసిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు కమల్ హాసన్ లిరిక్స్ అందించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సలార్ ’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్… ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్ 2’, అడవిశేష్ తో ‘డెకాయిట్’ సినిమాలతో బిజీగా ఉంది.
Shruti Haasan Movie Updates
ఇటీవలే ‘ఇనిమేల్’ అనే మ్యూజికల్ వీడియోసాంగ్ తో లోకేశ్ కనగరాజ్‌తో కలిసి ప్రేక్షకులను పలకరించిన శ్రుతి… మరో ప్రాజెక్టును ప్రకటించింది. చరిత్రలో దాగి ఉన్న ఎన్నో కథలను ప్రపంచానికి తెలియజేయడానికి వస్తున్నామంటూ తన రాబోయే చిత్రం ‘చెన్నై స్టోరీ’ సినిమా గురించి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది శ్రుతిహాసన్(Shruti Haasan). ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్నారు. ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించిన ఆమె ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ… ‘‘కొత్త సినిమా… కొత్త ప్రయాణం’ అనే వ్యాఖ్యతో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో వివేక్ కల్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : Abhishek Pictures: అభిషేక్ పిక్చర్స్ కొత్త సినిమా ‘స్మరామి నారాయణన్ తత్వమవ్యయం’ !