Anasuya Bharadwaj: లీడర్ పిలిస్తే జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ నటి అనసూయ తెలిపారు. నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను. నాకు లీడర్స్ ముఖ్యం… పార్టీలు కాదు. ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. వాళ్ల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తా. నామాట వినేవాళ్లు ఉండడం నా అదృష్టం. చెబితే వింటారు కదా అని స్టేజ్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. ఏదైనా బాధ్యతగా చేయాలి. జనసేన లీడర్ నన్ను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అన్నారు. ప్రస్తుతం అనసూయ(Anasuya Bharadwaj) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Anasuya Bharadwaj
ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్పారు. అలాగే పొలిటికల్ పార్టీలపైనా స్పందించారు. ‘‘డేట్స్ సర్దుబాటుకాకపోవడం వల్లే జబర్దస్త్ మానేశాను. ఇప్పటికీ కుదిరినప్పుడల్లా సెట్స్ కు వెళ్తుంటాను. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఆమె డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యల గురించి ఆమె మాట్లాడుతూ… ‘‘ఆయన చాలా పెద్దవారు. సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో ఆయన చేసినట్లు ఎవరూ చేయలేరు. నన్ను వాళ్ల ఇంట్లో మనిషిలా అనుకున్నారు. వాళ్ల భార్య, కూతురు ఎంతో నన్ను అలానే భావించారు. ఆయన కొంచెం పాతకాలం వ్యక్తి కాబట్టి నా డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదు. నాపై ఉన్న చనువుతో నేను పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం నచ్చలేదని ఆయన అభిప్రాయాన్ని చెప్పారంతే. దాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది రకరకాలుగా రాశారు’’ అని స్పష్టతనిచ్చారు.
Also Read : Game Changer: యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న రామ్ చరణ్ జరగండి… జరగండి పాట !