Emraan Hashmi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహనన్ కథానాయక. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెంకట్ కీల పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ కూడా సెప్టెంబరు 27వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో… అదే డేట్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
Emraan Hashmi Movie Updates
గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మీ(Emraan Hashmi) విలన్ గా నటిస్తున్నారు. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన టైటిల్ ఫస్ట్ లుక్, సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇమ్రాన్ హస్మి పుట్టిన రోజు సందర్భంగా… ఈ సినిమాకు సంబంధించి అతని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో ఆయన పొడవాటి జుట్టు… కనుబొమ్మపై కత్తిగాటుతో ఆసక్తికరంగా కనిపించారు ఇమ్రాన్ హస్మి.
తనిందులో ఓమి భావు అనే పాత్ర పోషిస్తున్నట్లు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో స్పష్టత ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో ఓజీకి… ఓమికి మధ్య జరిగే ఘర్షణను ఊహించలేమంటూ చిత్ర యూనిట్ సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. బాలీవుడ్ రొమాన్స్ కింగ్ గా గుర్తింపు పొందిన ఇమ్రాన్ హస్మికు తెలుగులో తొలి సినిమా కావడం… మాఫియా నేపథ్యంలో తెరకెక్కించిన సాహో సినిమా తరువాత అదే కోవలోని పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీను దర్శకుడు సుజిత్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.
Also Read : Priyadarshi Pulikonda: ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి !