Amala Paul: ట్విన్స్‌ కు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ ?

ట్విన్స్‌ కు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ ?

Hello Telugu - Amala Paul

Amala Paul: కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది ప్రముఖ నటి అమలాపాల్. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ… తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌ స్టా వేదికగా పోస్ట్ చేసింది. దీనితో ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ అమలాపాల్ కు అభినందనలు తెలిపారు. అయితే తాజాగా అమలాపాల్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పాపను తన చేతుల్లో ఎత్తుకుని ఉన్న ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన అమలాపాల్… ‘టూ హ్యాపీ కిడ్స్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీనితో ఈ క్యాప్షన్ చూసిన అభిమానులు త్వరలో తల్లి కాబోతున్న అమలాపాల్ ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పట్టబోతున్నారని అమలాపాల్ హింట్ ఇచ్చిందా అనే డౌటనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమలాపాల్ తాజా పోస్ట్‌ బట్టి చూస్తే త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే.

Amala Paul Comment

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ఇద్దరమ్మాయిలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన అమలాపాల్(Amala Paul)… తరువాత రామ్ చరణ్, విక్రమ్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించింది. గతంలో మలయాళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్… ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో అతనితో విడిపోయింది. ఆ తరువాత గతేడాది జూన్ నుండి జగత్ దేశాయ్ తో డేటింగ్ లో ఉన్న అమలాపాల్… నవంబర్ లో అతనితో పెళ్లి పీటలెక్కేసింది. అయితే పెళ్ళైన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అంటూ జనవరి 3న తన సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రస్తుతం అమలాపాల్ బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఆడుజీవితంలో నటిస్తోంది. ఆ తరువాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది.

Also Read : Ram Gopal Varma: ‘నా పెళ్లాం దెయ్యం’ అంటున్న ఆర్జీవీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com