Allu Arjun: ఐకాన్ స్టార్ ను చూసి అభిమాని తీవ్ర భావోద్వేగం !

ఐకాన్ స్టార్ ను చూసి అభిమాని తీవ్ర భావోద్వేగం !

Hello Telugu - Allu Arjun

Allu Arjun: తమ అభిమాన హీరోను దగ్గర నుండి చూడాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఫోటో దిగాలి, సెల్ఫీ దిగాలి అని అనుకోని అభిమానులు ఉండరు. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి హీరోల అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో ఏదో పనిమీద లేదా షూటింగ్ కోసం తమ పరిసర ప్రాంతాలు వస్తున్నారంటే చాలు… పనులన్నీ మానుకుని ఆ హీరో కోసం పడిగాపులు కాస్తుంటారు.

Allu Arjun Fans…

సినిమా రిలీజ్ రోజున చేసే హాడావుడి కంటే… వంద రెట్లు ఎక్కువ చేస్తుంటారు. కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ అయితే… తమ హీరోల ఆఫీసులు, ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. హీరో కనిపించగానే ఆనందంతో ఎగిరి గంతులేస్తూ… భావోద్వేగానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ను కలిసిన ఓ అభిమాని చాలా భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ఐకాన్ స్టార్ ఓదారుస్తూ ఆలింగనం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లో తన నివాసానికి వచ్చిన అభిమానులు కలిసారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని… తనఅభిమాన హీరోను కలిసిన వేళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని పట్టుకుని బోరున విలపించాడు. దీనితో ఏడుస్తున్న అభిమానిని అల్లు అర్జున్‌ ఓదార్చాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానికి బన్నీ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో తెగ వైరలవుతోంది. ఎంతైనా ఒక అభిమానిని దగ్గరికీ తీసుకుని స్టార్‌ హీరో సముదాయించడాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు.

Also Read : Gangs Of Godavari: విశ్వక్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com