Nayanthara : కోలీవుడ్‌లో విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార విడిపోతున్నట్టు సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం, నయన్ తన భర్త విఘ్నేష్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసి, “అన్నీ కోల్పోయాను” అని పోస్ట్ చేసింది. మరుసటి రోజు ఆమె తన భర్త ను ఫాలో అయింది. అయితే సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు మాత్రం ఈ వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాజాగా నయన్ మరోసారి ఈ రూమర్లకు తెరవేసింది. ప్రస్తుతం నయన్ దంపతులు తమ పిల్లలతో కలిసి వెకేషన్లో ఉన్నారు. ఈ జంట సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ఫోటోలను పంచుకున్నారు. ఈ జంట సౌదీ అరేబియాలో ఫార్ములా 1 కార్ రేస్‌లను చూసి ఆనందిస్తున్నారు. ఈ ఫోటోలను నయనతార(Nayanthara) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. విఘ్నేష్ కూడా నయన్ ఫోటోను షేర్ చేసి ఆమెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. “నన్ను ఇంత అద్భుతమైన మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు” అని ఆమె హార్ట్ ఎమోజీతో బదులిచ్చారు, ఆమె విడాకుల పుకార్లకు మరోసారి ముగింపు పలికింది.
Nayanthara Post Viral
గతేడాది ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ప్రధాన పాత్రలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో నయనతార బాలీవుడ్లో గొప్ప ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం “టెస్ట్ ` సినిమాలో నటిస్తోంది. ఆర్.మాధవన, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ డ్రామాలో నయన కుమిద పాత్రలో కనిపించనుంది.
Also Read : Ram Charan: తల్లి కోసం చెఫ్ గా మారిన రామ్ చరణ్ ! భర్త, అత్త కోసం కేమరాఉమెన్ అయిన ఉపాసన !