Ananya Panday: ‘డబుల్ ఇస్మార్ట్’లో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్ ?

‘డబుల్ ఇస్మార్ట్’లో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్ ?

Hello Telugu - Ananya Panday

Ananya Panday: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్, సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Ananya Panday Movie Update

పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌ పతాకంపై విషు రెడ్డి సీఈవోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday) నర్తించబోతున్నారని సమాచారం. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ‘లైగ‌ర్’లో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ నేపథ్యంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లో అనన్య పాండే స్పెషల్ సాంగ్ లో నటించడంపై ఎవరికీ అనుమానాలు లేకపోయినప్పటికీ… చిత్ర యూనిట్ నుండి మాత్రం ఇంకా అధికారిక సమాచారం రాలేదు. దీనితో ఈ వార్త నిజం అయితే బాగుంటుంది అని పూరీ, రామ్ అభిమానులు కోరుకుంటున్నారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్న ఈ సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. మరి డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read : Ooru Peru Bhairavakona OTT ఓటీటీకి సిద్దమవుతున్న సందీప్ కిషన్ సినిమా..అదే ఎప్పటి నుంచి…

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com