Hero Nithin: ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై అంచనాలను పెంచేసింది. నితిన్ పాత్రను పరిచయం చేసిన గ్లింప్స్ ఫన్నీగా ఉంది, అదే సమయంలో, కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ పరంగా సరికొత్త ఫీల్‌ని కలిగించింది. ఈ సినిమాలో నితిన్ దొంగగా కనిపించబోతున్నట్లు టైటిల్, టీజర్ బట్టి ఇట్టే అర్ధమైపోతుంది. అయితే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్… ‘రాబిన్ హుడ్’ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ ని ఇచ్చింది. దీనితో ఈ సినిమాపై అభిమానుల్లో ఆశక్తి పెరిగిపోతుంది.
Hero Nithin Movie Updates
నితిన్, వెంకీ కుడుముల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో మరోసారి యూనిక్, క్రేజీ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటోన్న ‘రాబిన్ హుడ్’ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ తాజాగా మున్నార్ లో పూర్తయింది. ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన టాకీ పార్ట్, నితిన్, ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌ను చిత్రీకరించినట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. నితిన్(Nithin) సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చింది. దీనితో నితిన్ యాక్షన్, వెంకీ కుడుముల స్టైలిష్ దర్శకత్వం కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Vishwak Sen: అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ ! ఆసక్తికరంగా ‘గామి’ టీజర్ !