Hanu-Man: ‘హను-మాన్’ సినిమా మరో రికార్డ్ ! 150 థియేటర్లలో 50 రోజులు !

‘హను-మాన్’ సినిమా మరో రికార్డ్ ! 150 థియేటర్లలో 50 రోజులు !

Hello Telugu - Hanu-Man

Hanu-Man: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా… వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఇటీవల కాలంలో 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా హనుమాన్ రికార్డు సృష్టించింది. గత కొన్నేళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50, 100 రోజులన్న మాటే లేదు. చాలా సినిమాలు నెల రోజులు తిరిగేసరికి ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీనితో థియేటర్ లో సినిమా 50 రోజులు ప్రదర్శించడం చాలా అరుదుగా మారింది. అలాంటి సమయంలో మంచి కలెక్షన్లతో ‘హను-మాన్’ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.

‘హను-మాన్(Hanu-Man)’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆనందం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా జీవితంలో ఈ 50 రోజులు ఎంతో అద్భుతమైనవి. ఈ అనుభూతిని ఎలా చెప్పాలి ? ఎక్కడినుంచి మొదలు పెట్టాలి ? ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. మంచి సినిమాపై ప్రేక్షకుడు చూపే అభిమానం ఎంతటి కష్టాన్ని అయినా మరిపిస్తుంది. ‘హనుమాన్‌’ అద్భుత విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.

Hanu-Man – ఓటీటీలో ‘హను-మాన్’ ఎప్పుడు వస్తుందంటే ?

50 రోజులు పూర్తి చేసుకున్న ‘హను-మాన్(Hanu-Man)’ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘హను-మాన్’ సినిమా డిజిటల్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 లో మార్చి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే స్ట్రీమింగ్ కు రాలేదు. ఇప్పుడు మహాశివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని ఓటీటీ వేదిక జీ5 భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇదే విషయాన్ని పలువురు నెటిజన్లు ఎక్స్‌ వేదికగా జీ5ని ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఆ ట్వీట్‌ లకు జీ5 సోషల్‌మీడియా టీమ్‌ సమాధానమిస్తూ… ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని… మరిన్ని అప్‌డేట్స్‌ కు తమ సోషల్‌మీడియా ఖాతాలను ఫాలోకావాలని తెలిపింది.

Also Read : Tamannaah : ఘనంగా తమన్నా ఓదెల2 సినిమా ప్రారంభోత్సవం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com