35 Movie OTT : కుటుంబ కథా చిత్రం ’35 చిన్న కథ కాదు’ ఓటీటలో

అందుకే లెక్కల మాస్ట్టారు చాణక్య వర్మ( ప్రియదర్శి) అరుణ్‌ని ‘జీరో’ అని పిలుస్తాడు...

Hello Telugu - 35 Movie OTT

35 Movie : ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి కుటుంబ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న ‘35-చిన్న కథ కాదు’ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. నివేథా థామస్(Nivetha Thomas), విశ్వదేవ్‌, ప్రియదర్శి, భాగ్యరాజ్‌, గౌతమి, ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్‌6న థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. నంద కిషోర్ ఈమని ఈ చిత్రానికి రచన, దర్శకత్వం చేయ‌గా రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించారు. క‌థ విష‌యానికి వ‌స్తే.. సరస్వతి (నివేతా థామస్‌) ప్రసాద్‌ (విశ్వదేవ్‌ రాచకొండ) తిరుపతిలో సాధారణ జీవితం సాగించే భార్యభర్తలు. ప్రసాద్‌ బస్సు కండెక్టర్‌. సరస్వతి టెన్త్‌ ఫెయిల్‌ అయిన గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దోడు అరుణ్‌ (అరుణ్‌ దేవ్‌), చిన్నోడు వరుణ్‌ (అభయ్‌ శంకర్‌). చిన్నోడు చదువులో పర్వాలేదు కానీ పెద్దోడు లెక్కల్లో వీక్‌. అందుకే లెక్కల మాస్ట్టారు చాణక్య వర్మ( ప్రియదర్శి) అరుణ్‌ని ‘జీరో’ అని పిలుస్తాడు. లెక్కల్లో వరుసగా జీరోలు తెచ్చుకోవడం వల్ల ఒక సంవత్సరం డిమోట్‌ అయ్యి తమ్ముడు చదువుతున్న క్లాసులో కూర్చోవాల్సి వస్తుంది.

35 Movie in OTT…

స్నేహితులకు దూరమై, చదువు భారంగా మారిన అరుణ్‌ స్కూల్లో కొనసాగాలంటే లెక్కల్లో కనీసం ’35’ మార్కులు తెచ్చుకోవాల్సిందే. అప్పుడు అరుణ్‌ ఏం చేశాడు? స్నేహితులకు దగ్గర కావడానికి, ఏం చేశాడు. లెక్కలంటే భయపడుతున్న కొడుకుకి పదో తరగతి ఫెయిల్‌ అయిన తల్లి పాఠాలు ఎలా చెప్పింది. చివరికి అరుణ్‌ లెక్కల్లో పాస్‌ అయ్యాడా లేదా అన్నది మిగిలిన కథ. తిరుపతిలో నివసించే ఓ బ్రాహ్మ‌ణ కుటుంబం, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం తపన పడే తల్లిదండ్రులు చుట్టూ కథ తిరుగుతూ చూస్తున్న ప్ర‌తి ప్రేక్ష‌కుడిని సినిమాలో లీన‌మ‌య్యేలా చేస్తుంది. తన బిడ్డ లెక్కల్లో రాణించేలా తీర్చిదిద్దడానికి తల్లి స్వ‌యంగా రంగంలోకి దిగ‌డం అనే పాయింట్ ఆక‌ట్ట్ఉకుంటుంది. ఇప్పుడీ సినిమా అహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో ఈ సినిమాను చూడ‌లేక పోయారో, కుటుంబ స‌మేతంగా అంతా క‌లిసి మూవీ చూడాల‌నుకునే వారు ఈ మూవీని ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్ చేయ‌కుండా పమీ పిల్ల‌ల‌తో క‌లిసి చూసేయండి. డోంట్‌మిస్‌..

Also Read : Chandrahass : నా సినిమా నచ్చకుంటే టికెట్ డబ్బులు వాపస్ అంటున్న యాటిట్యూడ్ స్టార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com