35 Chinna Katha Kaadu : రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన న్యూ ఏజ్ క్లీన్ ఫ్యామిలీ డ్రామా ‘35-చిన్న కథ కాదు’. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని.. థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ సక్సెస్ టూర్‌ని నిర్వహిస్తున్నారు. ఈ సక్సెస్ టూర్‌లో భాగంగా మేకర్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
35 Chinna Katha Kaadu Movie Team Visited..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ‘35 చిన్న కథ కాదు(35 Chinna Katha Kaadu)’ టీమ్ నుంచి హీరోయిన్ నివేద థామస్, నటుడు విశ్వదేవ్, దర్శకుడు నంద కిషోర్ ఈమని మొదలైన వారు ఉన్నారు. ఈ సందర్భంగా నివేద థామస్ మాట్లాడుతూ.. మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాను. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది. స్వామివారి పాదపద్మాల చెంత నుంచే చిత్ర విజయ యాత్రను మొదలు పెట్టడం ఆనందంగా వుందని తెలిపారు. నటుడు విశ్వదేవ్ మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో చిత్రం విజయం సాధించింది. తిరుపతిలోని కథకు.. ఇక్కడ నుంచే విజయ యాత్ర మొదలు పెట్టడం ఆనందంగా వుందని అన్నారు. చిత్ర విజయం పట్లనూ, శ్రీవారి దర్శనం పట్లనూ దర్శకుడు నంద కిషోర్ ఈమని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : Ravi Basrur: ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న రవి బస్రూర్ !