Devara Ticket Price : దేవర టికెట్ రేట్ల పెంపునకు ఆమోదించిన రెండు తెలుగు రాష్ట్రాలు

కొరటాల శివ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది...

Hello Telugu - Devara Ticket Price

Devara : దేవర.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మార్మోగుతోన్న పేరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ హంగామాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర పార్ట్ – 1(Devara) రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే దేవర టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను మేకర్స్ కోరారు. ఇందుకు ఇరు ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చాయి.దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి.. నైజాం ఏరియాలో ఉన్న మల్టీప్లెక్స్ ల్లో రూ. 413, అలాగే సింగిల్ స్క్రీన్లలో రూ. 250 పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 325, సింగిల్ స్క్రీన్లలో రూ. 200 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. మెుదటి వారం లేదా పది రోజుల వరకు పెంచిన ఈ టికెట్ల రేట్లే కంటిన్యూ అవ్వనున్నాయి.

Devara Ticket Price Updates

కొరటాల శివ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర(Devara) చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో దేవర చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళతున్నారు. ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‏లు తారక్ తో ముచ్చటించనున్నారు. అలాగే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేయనున్నారు.

Also Read : Shraddha Srinath : మోలీవుడ్ మహిళా వేధింపులపై స్పందించిన శ్రద్ధ శ్రీనాథ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com