Pranaya Godari : గోదావరి అందాలు కనిపించేలా తీసిన ‘ప్రణయ గోదారి’ ఫస్ట్ లుక్

హీరో, హీరోయిన్లు సైకిల్ పై నది ఒడ్డున తిరుగుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు...

Hello Telugu - Pranaya Godari

Pranaya Godari : వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలకు కొత్త దర్శకులకు డిమాండ్ ఉంది. ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలను తెరపై ఆవిష్కరించారు. ‘ప్రణయగోదారి’ సరికొత్త ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ జానర్ చిత్రం. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాస్యనటులుగా ప్రసిద్ధి చెందిన అలీ కుటుంబానికి చెందిన నటుడు సాధన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక ప్రసాద్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ‘ప్రణయగోదారి’ని పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్‌పై పరమల లింగయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఓ వైపు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేస్తున్న మేకర్స్ మరోవైపు సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పీఎల్‌వీ క్రియేషన్స్ బ్యానర్ లోగోతో పాటు చిత్ర ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ సినీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy) ఆవిష్కరించారు. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీటీసీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Pranaya Godari Movie Teaser

తాజాగా విడుదలైన ఈ వైరల్ గా మారింది. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎమోషన్స్ కలిగించే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే సహజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గోదారి అందాలు, మనుషుల జీవన విధానాన్ని పోస్టర్‌లో చూపించారు. హీరో, హీరోయిన్లు సైకిల్ పై నది ఒడ్డున తిరుగుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. మార్కండేయ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఐదర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కో-డైరెక్టర్‌గా జగదీష్ పీరి, డిజైనర్‌గా టీఎస్‌ఎస్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా గంటా శ్రీనివాస్ ఉన్నారు. కొరియోగ్రాఫర్లు కళాధర్, మోహనకృష్ణ, రజని, ఎడిటర్లు కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్ విజయకృష్ణ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Also Read : Sunny Leone: ప్రభుదేవాతో ఐటెం సాంగ్ కు సన్నీలియోన్ సై !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com