Posani : నటుడు పోసాని కృష్ణ మురళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. తను విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనంగా ఉంటున్నారని, దేనికి సరైన సమాధానం చెప్పకుండా దాట వేత ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పోసాని కృష్ణ మురళిపై 14 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనట్లు తెలిపారు.
Posani Krishna Murali Shocking Case
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అమ్మనా బూతులు తిట్టాడని ఆరోపించారు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి, తనయుడు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య, మాజీ భార్య , కొడుకు, కూతురుపై అనరాని మాటలు అన్నారంటూ తెలిపారు.
ఇదిలా ఉండగా పోసాని భార్య తమపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాము ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. అరెస్ట్ కు సంబంధించి ముందస్తుగా నోటీసులు ఇచ్చినా తీసుకునేందుకు నిరాకరించారని, అందుకే రాయచోటికి తీసుకు రావాల్సి వచ్చిందన్నారు సీపీ. విచారణకు సహకరిస్తేనే పోసాని కృష్ణ మురళికి బాగుంటుందని లేక పోతే ఇబ్బందులు తప్పవన్నారు.
Also Read : Hero Prabhas New Look :రుద్ర రూపంలో ప్రభాస్ అదుర్స్