12th Fail: మరోసారి సత్తా చాటిన ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ !

మరోసారి సత్తా చాటిన ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ !

Hello Telugu- 12th Fail Movie

12th Fail: ఏడాదికి ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. ప్రేక్షకుల మనసుల్ని గెలిచేది కొన్ని చిత్రాలు మాత్రమే. అందులో ఒకటే ‘ట్వెల్త్‌ ఫెయిల్‌(12th Fail)’. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి ఐపీఎస్‌గా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న మనోజ్‌ శర్మ జీవితం ఆధారంగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’లో ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్‌ పెర్ఫార్మర్‌ గా (క్రిటిక్‌) విక్రాంత్‌ మాస్సే పురస్కారాల్ని గెలుచుకున్నారు.

12th Fail Movie Updates

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ చిత్రోత్సవాల్లో కథానాయకుడు రామ్‌చరణ్‌ ‘ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌’గా అవార్డును అందుకున్నారు. సినిమాకు అందించిన సేవలకు గానూ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సినిమా ఎక్స్‌లెన్స్‌ అవార్డును గెలచుకున్నారు. 2024 సంవత్సరానికి గానూ ఐఎఫ్‌ఎఫ్‌ఎం ప్రకటించిన ఈ పురస్కారాల్లో ‘చందు ఛాంపియన్‌’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కార్తిక్‌ ఆర్యన్, ‘ఉల్లోజుక్కు’(మలయాళం)లోని తన నటనకు ఉత్తమ నటిగా పార్వతీ తిరువోతు, ఉత్తమ దర్శకుడిగా కబీర్‌ ఖాన్‌ (చందు ఛాంపియన్‌), నిథిలన్‌ స్వామినాథన్‌ (మహారాజ) అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ఉత్తమ చిత్రంగా (క్రిటిక్‌) ‘లాపతా లేడీస్‌’, ఇక్వాలిటీ ఇన్‌ సినిమా విభాగంలో ‘డంకీ’ పురస్కారాల్ని గెలుచుకున్నాయి.

Also Read:Bunny Vas: నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలకు బన్నీ వాస్ కౌంటర్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com